దీదీకి షా కౌంట‌ర్.. అక్రమ వలసదారులే అవుట్ సైడర్స్..!

దీదీకి షా కౌంట‌ర్.. అక్రమ వలసదారులే అవుట్ సైడర్స్..!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కొత్త కొత్త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే ఉన్నారు పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల నేత‌లు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల‌ను అవుటర్స్ అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ గూండాల‌కు లొంగిపోను, వాళ్ల‌కు ప‌శ్చిమ బెంగాల్‌ను అప్ప‌గించ‌బోను అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీదీ వ్యాఖ్య‌ల‌కు అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా... సీఎం మమత అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని, వారే అవుట్ సైడర్స్ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రధాని మోడీపై, త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే మ‌మ‌త ప‌నిగా పెట్టుకుంద‌న్న ఆయ‌న‌.. అంతకు మించిన అజెండా ఆమె వద్ద లేదంటూ ఎద్దేవా చేశారు. ఇక‌, తాను ఈ దేశానికి హోంమంత్రిని.. దేశ ప్రజలతో మాట్లాడే హక్కు నాకు లేదా? తాను ఎలా అవుట్ సైడర్‌ను అవుతానో చెప్పాలని నిల‌దీశారు షా.. ఈ దేశంలోనే పుట్టా.. మరణించిన తర్వాత ఈ పవిత్ర భూమిలోనే దహన సంస్కారాలు నిర్వ‌హిస్తారంటూ వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. కానీ, మీ ఓటు బ్యాంకుగా ఉన్న అక్రమ వలసదారులే అవుట్ సైడర్స్ అంటూ మండిప‌డ్డారు.