ఆ ముగ్గురి విడుదలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!!

ఆ ముగ్గురి విడుదలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!!

ఆగష్టు 5 వ తేదీన జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన సంగతి తెలిసిందే.  ఆ సమయంలో రాష్ట్రంలోని కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. అప్పటి వరకు  రాష్ట్రంలో ఉగ్రవాదుల సానుభూతి పరులను, వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను ఆ రాష్ట్రం నుంచి తరలించారు.  అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తులను కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి తరలించిన సంగతి తెలిసిందనే.  

దాదాపు 60 రోజుల తరువాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.  జమ్మూ కాశ్మీర్లోని కేవలం 6 ప్రాంతాల్లో మాత్రమే 144 సెక్షన్ అమలులో ఉన్నట్టుగా అమిత్ షా పేర్కొన్నారు.  ఇక మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తిల విడుదల విషయం తన చేతుల్లో లేదని, అక్కడి పోలీసులు, సైన్యం చేతుల్లో మాత్రమే ఉంటుందని అన్నారు.  అక్కడి పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి అని పోలీసులు, సైన్యం భావిస్తే వారిని గృహనిర్బంధం నుంచి విడుదల చేస్తారని అమిత్ షా పేర్కొన్నారు.