ప్రధానితో అమిత్ షా అత్యవసర భేటీ..లాక్‌డౌన్ ఎత్తేస్తారంటూని ప్రచారం !

ప్రధానితో అమిత్ షా అత్యవసర భేటీ..లాక్‌డౌన్ ఎత్తేస్తారంటూని ప్రచారం !

లాక్‌డౌన్‌పై కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. హోం మంత్రి అమిత్‌ షాతో ప్రధాని మోడీ కీలక చర్చులు జరుపుతున్నారు. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కొనసాగించాలా? లేదా? అనే అంశంపై చర్చిస్తోంది. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలూ చర్చిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది.

దీంతో కరోనా తీవ్రంగా ఉన్న జోన్లలోనే లాక్‌డౌన్ కొనసాగిస్తూ మిగతా చోట్ల ఎత్తివేసే విషయంపైనా చర్చ జరుగుతోంది. కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశంపైనా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాతో వివాదాలపై కూడా మోడీ, షా చర్చించినట్లు తెలుస్తోంది. మూడు వారాలుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. యుద్ధానికి సై అన్నట్లు వ్యవహరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ అంశం కలకలం రేపుతోంది. దీంతో చైనాను అదుపుచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోడీ, షా చర్చించినట్టు సమాచారం.