సోమ్‌నాథ్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు

సోమ్‌నాథ్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు

గుజరాత్ లోని ప్రముఖ సోమ్‌నాథ్ ఆలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి అమిత్ షాతో పాటు ఆయన కుటుంబసభ్యులు తరలివచ్చారు. భార్య, కుమారుడు, కోడలు, మనవరాలుతో కలిసి అమిత్ షా పరమశివునికి ప్రత్యేక పూజలు జరిపారు. సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ లో అమిత్ షా ట్రస్టీగా ఉన్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు అమిత్ షా సోమ్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ఒక రోజు గుజరాత్ పర్యటనకు వచ్చిన అమిత్ షా అహ్మదాబాద్ లోని తన కుటుంబంతో గడపనున్నారు. ఆదివారం తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు.