'దీదీ.. మీకు రోజులు దగ్గరపడ్డాయి..'

'దీదీ.. మీకు రోజులు దగ్గరపడ్డాయి..'

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కోల్‌కతాలో నిన్న తన రోడ్‌షోపై టీఎంసీ కార్యకర్తలు మూడు సార్లు దాడులు చేశారన్నారు.. తనపై రాళ్ల దాడి జరిగిందని.. తృణమూల్‌ కార్యకర్తలు పెట్రోల్‌ బాంబులతో అలజడి సృష్టించారని ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్‌ దళాలు లేకపోయుంటే తాను క్షేమంగా బయటపడుండే వాడిని కాదని అన్నారు. ఈశ్వరచంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేసింది కూడా తృణమూల్‌ కార్యకర్తలేనన్న షా.. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. బెంగాల్‌లో హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత అని స్పష్టం చేశారు. 

మమత తన ప్రసంగాల్లో బీజేపీపై పగ తీర్చుకుంటామని అన్నారని.. ఈ వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా మమతా బెనర్జీపై నిషేధం విధించాలని షా డిమాండ్‌ చేశారు. ఓట్‌ బ్యాంక్‌ పాలటిక్స్‌ కోసం మమత హింస చెలరేగేలా చేస్తున్నారని ఆరోపించారు. మమత ఎవర్ని ఎంత రెచ్చగొట్టినా సరే.. బెంగాల్‌లో కమల వికాసం ఖాయమని షా ఆశాభావం వ్యక్తం చేశారు.