ఆరోపణలు నిరూపించు.. లేకుంటే స్వీట్ తినిపించాలి-దీదీ సవాల్

ఆరోపణలు నిరూపించు.. లేకుంటే స్వీట్ తినిపించాలి-దీదీ సవాల్

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడతాఉంటే... అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి... తాజాగా పశ్చిమబెంగాల్‌లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా... టీఎంసీ సర్కార్, సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు గుప్పించారు.. అయితే, షా కామెంట్లకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీ.. టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై అమిత్ షా చేసిన ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఆ ఆరోపణలను నిరూపించాలి.. లేకపోతే తనకు స్వీట్ తినిపించాలంటూ ప్రతి సవాల్ విసిరారు.. బెంగాల్‌ అభివృద్ధి గురించి ఉద్దేశపూర్వకంగానే తప్పుగా మాట్లాడుతున్నారని విమర్శించారు దీదీ.. అన్ని అభివృద్ధి సూచీల్లోనూ తమ రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్న ఆమె.. అమిత్ షా చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూ, ఒక్కొక్కటి తిప్పికొట్టారు. పదేళ్ల నుంచి తన ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ కాలంలో రాజకీయ హత్యలు, ఇతర నేరాలు తగ్గినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు బెంగాల్ సీఎం.. గతంలో మీరు కనీసం ఒకసారైనా ఇక్కడికి రాలేదు అని అమిత్ షాను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. ఈనెల 20న అమిత్‌షా అనేక ఆరోపణలు చేశారు.. వీటిని నిరూపించాలని, లేదంటే తనకు ధోక్లా (స్వీట్) తినిపించాలని సవాల్ చేశారు మమతా బెనర్జీ..