రివర్స్ టెండరింగ్.. జగన్‌కు షా అభినందనలు..!

రివర్స్ టెండరింగ్.. జగన్‌కు షా అభినందనలు..!

ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగిన టెండర్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దీనిపై టీడీపీ విమర్శలు గుప్పించింది. అయితే, పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుసరించిన రివర్స్‌ టెండరింగ్‌ విధానంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఏపీ సీఎం జగన్‌ను అభినందించారు. రూ.838 కోట్ల ప్రజాధనం ఆదా కావడంపై సంతోషం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి. పోలవరంపై ఇదే విధంగా  ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రోత్సహించారు. ఢిల్లీ పర్యటనలో అమిత్‌షాతో దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన భేటీలో వివిధ అంశాలతోపాటు పోలవరం ప్రాజెక్టుపై అనుసరించిన రివర్స్‌ టెండరింగ్‌ను ప్రస్తావించారు సీఎం జగన్‌. ఏపీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఏపీ సమస్యల పరిష్కరానికి ఇతర శాఖల మంత్రులతోనూ తాను మాట్లాడతానని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.