2024లోగా వాళ్ళను పంపించేస్తాం... 

2024లోగా వాళ్ళను పంపించేస్తాం... 

దేశంలో ఎన్ఆర్సిని మొదటిసారి అస్సాంలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు.  దేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులను తమ సొంత దేశాలకు పంపించడమే ఈ ఎన్ఆర్సి ముఖ్యఉద్దేశ్యం.  1947 నుంచి ఇప్పటి వరకు దేశంలోకి లక్షలాది మంది విదేశాల నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు.  బెంగాల్ విభజన తరువాత కూడా బాంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి.  ఇటీవల కాలంలో కూడా ఈ వలసల సంఖ్య పెరిగింది.  ముఖ్యంగా బాంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వచ్చిన వలసల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఆ రాష్ట్రంలో కూడా ఎన్ఆర్సి ని అమలు చేయాలనీ భావిస్తోంది.  

2024 వ సంవత్సరం వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సిని అమలు చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది.  2024 వరకు ఎన్ఆర్సిని అమలు చేసి తీరుతామని అమిత్ షా పేర్కొన్నారు.  ఝార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బాహారాగోరాలో అమిత్ షా పర్యటించారు.  "2024 ఎన్నికల్లా ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేసి చొరబాటుదారులను గుర్తించి వారిని దేశం నుంచి పంపిచేస్తాం. వారిని పంపించొద్దని రాహుల్‌ గాంధీ అంటున్నారు. పంపిస్తే ఎక్కడకు వెళతారు? ఎలా బతకుతుతారు? అని ప్రశ్నిస్తున్నారు. కానీ 2024 ఎన్నికల నాటికి అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించి తీరుతాం" అని బాహారగోరా ప్రచార సభలో అమిత్ షా పేర్కొన్నారు.