మమతా సర్కార్‌పై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు...

మమతా సర్కార్‌పై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు...

పశ్చిమ మిడ్నాపూర్‌లో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మమత సర్కార్‌పై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌ కు వచ్చిన జేపీ నడ్డాపై దాడి చేశారని ఫైర్‌ అయ్యారు అమిత్‌ షా. అలాగే 300 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలను చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. మమత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తన మేనల్లుడిని సీఎం చేసేందుకు మమతా బేనర్జీ పరితపిస్తోందని మండిపడ్డారు. మమత అవినీతిని చూడలేకే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని అమిత్‌ షా అన్నారు.  ఇది ఇలా ఉండగా..  తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు టీఎంసీ రెబల్‌ నేత సువేందు. ఇటీవలే టీఎంసీకి సువేందు అధికారి రాజీనామా చేశారు.