హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

కరోనా ఎవరినీ వదలడం లేదు. నేతలు, సెలబ్రిటీలు మొదలు సామాన్య జనాన్ని కూడా ఇది ఇబ్బంది పెడుతోంది. నిన్నటికి నిన్న కరోనా కారణంగా ఏపీలో బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు మరణించగా ఈరోజు ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. "కొన్ని లక్షణాలు కనిపించడంతో టెస్ట్ కి వెళ్ళాను, అది పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బానే ఉంది, కానీ నేను డాక్టర్ల సలహా మేరకు హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నా, నాతో కాంటాక్ట్ అయిన అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తోన్నా, మీరు కూడా టెస్ట్ చేయించుకోండి" అని ఆయన కోరారు.