ఈడెన్‌ గార్డెన్స్‌ లో డే-నైట్ టెస్ట్ కి అమిత్ షా

ఈడెన్‌ గార్డెన్స్‌ లో డే-నైట్ టెస్ట్ కి అమిత్ షా

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న తొలి డే/నైట్ టెస్టుకు హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. చారిత్రాత్మక ఈడెన్‌ గార్డెన్‌లో నవంబర్‌ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. భారత్‌లో తొలిసారి డే/నైట్‌ టెస్ట్‌ ఆడనుండంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడెన్‌లో జరిగే చారిత్రక ఘట్టాన్ని మరింత అపురూపంగా మలచడానికి క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్‌) కృషి చేస్తోంది. ఈ చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరిద్దరూ గంట మోగించి డే/నైట్ టెస్టుని ప్రారంభించనున్నారు. బెంగాల్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ ప్రధాని మోడీని, అమిత్‌ షాను ఆహ్వానించగా దీనికి షా సానుకూలంగా స్పందించారని.. తొలి డే అండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు హాజరవుతారని క్యాబ్‌ అధికారులు తెలిపారు.