హైదరాబాద్‌కు'షా'

హైదరాబాద్‌కు'షా'

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.  బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటల హైదరాబాద్‌ చేరుకోన్న బీజేపీ చీఫ్... రాత్రి 8.40 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. హైదరాబాద్ చేరుకోగానే విమానాశ్రయంలో మొదట సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో భేటీ కానున్నారు హోంశాఖ మంత్రి... ఆ తర్వాత శంషాబాద్‌ సమీపంలోని రంగానాయకుల తండాలో గిరిజన మహిళ సోనినాయక్‌ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు. ఇక, సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో పాల్గొని కీలక సూచనలు చేయనున్నారు. జాతీయ, రాష్ట్ర నేతలతో కలిసి డిన్నర్ చేసిన తర్వాత రాత్రి 8.40కి ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు అమిత్‌షా.