బెంగాల్ లో షా పర్యటన... వేడెక్కిన రాజకీయం 

బెంగాల్ లో షా పర్యటన... వేడెక్కిన రాజకీయం 

వెస్ట్ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా రాష్ట్రంపై కమలదళం కన్నేసింది.  ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా వేయాలని చూస్తున్న కమలంకు 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మంచి బూస్ట్ ఇచ్చాయి.  కష్టపడితే అధికారంలోకి రావచ్చని భావించిన కమలం పార్టీ ఏడాది ముందు నుంచే ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది.  ఇందులో భాగంగానే పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు బెంగాల్ చుట్టూ తిరుగుతున్నారు.  తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లారు.  తెల్లవారు జామున కోల్ కతా వెళ్లిన అమిత్ షా, ఉదయం శ్రీరామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు.  అక్కడి నుంచి వివేకానందుడు జన్మించిన ఇంటికి వెళ్లి వివేకానంద చిత్రపటానికి పాలమాల వేశారు.  అక్కడి నుంచి స్వాతంత్ర సమరయోధుడు కుదీరామ్ బోస్ జన్మించిన మిడ్నాపూర్ లోని అయన సొంత గ్రామానికి వెళ్లారు.  అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించబోతున్నారు.  కుదీరామ్ బోస్ సొంతగ్రామానికి సుబెందు అధికారి కూడా వెళ్తున్నారు.  టిఎంసిలో కీలక నేతగా ఉన్న అయన, ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.  ఈరోజు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.  ఇప్పటికే ఆయనకు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించింది.