మరోసారి కేంద్రం వర్సెస్ బెంగాల్.. రంగంలోకి అమిత్‌షా..!

మరోసారి కేంద్రం వర్సెస్ బెంగాల్.. రంగంలోకి అమిత్‌షా..!

కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది.. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయం అయినా వెంటనే విమర్శంచడంలో సీఎం మమతా బెనర్జీ ముందుంటారు.. తాజాగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బెంగాల్  వలసకార్మికుల తరలింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వలస కార్మికుల తరలింపు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును తప్పుపడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ రాశారు. కార్మికులను సొంతరాష్ట్రానికి తరలించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లూ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తోందని లేఖలో అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో కేంద్రానికి మద్దతు తెలిపింది. వలస కార్మికుల తరలింపుకు ఎన్ని రైళ్లు కావాలని కేంద్రం పలు మార్లు అడిగినా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించ లేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. తాజాగా ఎనిమిది రైళ్లు కావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెప్పిందని, దానికి తగ్గట్టుగా కేంద్రం రైళ్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.