'సైరా' టీజర్ స్కోర్ ముగించిన అమిత్ !

'సైరా' టీజర్ స్కోర్ ముగించిన అమిత్ !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రానికి మొదట్లో ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తారని టీమ్ ప్రకటించిన వేరే కారణాల వలన ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.  ఆ తరవాత చాలా మంది సంగీత దర్శకుల పేర్లు వినిపించినా చివరికి బాలీవుడ్ కంపోజర్ అమిత్ త్రివేదిని ఎంచుకున్నారు టీమ్. 

'సైరా' లాంటి గొప్ప సినిమాకి వర్క్ చేయడం సంతోషంగా ఉందన్న త్రివేది టీజర్ కోసం స్కోర్ ను కంపోజ్ చేయడం పూర్తిచేశారట.  22న చిరంజీవి జన్మదినం సందర్బంగా టీజర్ ను రేపు 21 ఉదయం 11 గంటల 30 నిముషాలకు విడుదలచేయనున్నారు.  రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.