రైతుల అప్పుల్ని చెల్లించిన అమితాబ్

రైతుల అప్పుల్ని చెల్లించిన అమితాబ్

తన వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేయడంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ ముందుంటారు.  ఇప్పటికే అనేక మందికి అనేక విధాలుగా సహాయం చేసిన ఆయన తాజాగా మరో గొప్ప పనిచేశారు.  గతంలో మాటిచ్చిన ప్రకారమే బీహార్ రాష్ట్రానికి చెందిన 2,100 మంది రైతుల్ని రుణ విముక్తుల్ని చేశారు.  

బీహార్లో బ్యాంకుల నుండి తీసుకున్న అప్పుల్ని చెల్లించలేని దయనీయ స్థితిలో ఉన్న 2,100మంది రైతుల్ని ఎంపిక చేసిన ఆయన వారు కట్టాల్సిన రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించారు.  ఈ విషయాన్ని బ్లాగ్ ద్వారా స్వయంగా వెల్లడించారు అమితాబ్.  రైతుల సంక్షేమం కోసం ఇంతలా కృషి చేసిన ఆయన్ను జనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.