ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

ఫోటో అన్నది ఎప్పటికి గుర్తుండిపోయే ఒక సాధనం.  అందుకే చాలామంది ఫోటోలను తీసుకొని వాటిని పదిలంగా భద్రపరుచుకుంటారు.  సెలెబ్రిటీల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రతి నిత్యం ఫోటోలు దిగుతూ వాటిని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.  నోటితో చెప్పలేని ఎన్నో విషయాలను ఫోటోల ద్వారా పలికించవచ్చు.  అందుకే ఫొటోకు అంతటి పేరుంది.  

అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా ఓ ఫోటోను సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ... ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా అని అడిగాడు.  కొత్తగా చూసేవాళ్లయితే కాసేపు అర్ధం కాదు.  ఎవరా అమ్మాయి అని ఆలోచనలో పడతారు.  ఆ అమ్మాయి ఎవరో కాదు... ఫేమస్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.  పుకార్ సినిమా సమయంలో కరీనా కపూర్ తన తండ్రి రణధీర్ కపూర్ తో కలిసి సెట్స్ కు వచ్చింది.  సెట్స్ లో కాలికి చిన్న గాయం కావడంతో బ్యాండేజ్ తో కట్టుకట్టారు.  ఆ సమయంలో తీసిన ఫోటో ఇది అని అమితాబ్ ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నారు.