హ్యాక్ అయిన అమితాబ్ ట్విట్టర్

హ్యాక్ అయిన అమితాబ్ ట్విట్టర్

 

సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవడం తరచూ జరుగుతూనే ఉంటుంది.  కొందరు కావాలనే టార్గెట్ చేసి మరీ సెలబ్రిటీల ప్రొఫైల్స్ హ్యాక్ చేస్తుంటారు.  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ సైతం ఇప్పుడు ఈ ఇబ్బందికిని ఎదురుకోవాల్సి వచ్చింది.  ఆయన ట్విట్టర్ ఖాతాను అర్థరాత్రి హ్యాక్ చేశారు.  పోఫైలో పిక్చర్ స్థానంలో పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఫోటోను పెట్టి, ఐ లవ్ పాక్ అంటూ పోస్ట్ పెట్టారు.  దీంతో అవాక్కైన అమితాబ్ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించగా వారి స్పందించి ఖాతాను రికవర్ చేశారు.  ఇది టర్కీకి చెందిన హ్యాకర్స్ గ్రూప్ పనని తెలిసింది.  పైగా సదరు హ్యాకర్స్ గ్రూప్ ఇలాంటివి ఇంకా జరుగుతాయని హెచ్చరికలు జారీచేయడం గమనార్హం.