ఈ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసా..?

 ఈ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసా..?

జ్ఞాపకాలు మదిలో ఎంతకాలం గుర్తు ఉంటాయి. మహా  ఐతే సంవత్సరం, రెండేళ్లు గుర్తుంటాయి.  ఇంకా గుర్తు పెట్టుకుంటే పదేళ్లు గుర్తు ఉంటాయి.  ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన అన్ని విషయాలను గుర్తుంచుకోలేకపోవచ్చు.  అవి గుర్తు చేసుకునే సంఘటనలు ఎదురైనపుడు తప్పకుండా స్మృతిపధం నుంచి బయటకు వస్తాయి.  అలా వచ్చిన ఓ స్మ్రుతిపదం అమితాబ్ చిన్నప్పటి ఫోటో.  

అమితాబ్ బచ్చన్, సోదరుడు అజితాబ్ బచ్చన్ అమ్మ  తేజి బచ్చన్   తో కలిసి తీసుకున్న ఫోటోను అమితాబ్ ట్విట్టర్ లో షేర్ చేశారు.  తన తల్లి తేజి బచ్చన్ 104 వ జయంతి సందర్భంగా ఈ ఫోటోను అమితాబ్ షేర్ చేశాడు.  "ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మ" అని ట్వీట్ చేస్తూ ఫోటోలను షేర్ చేశాడు.  చిన్నతనంలో తల్లితో కలిసి తీయించుకున్న ఫొటోల్లో ఇది ఒకటి అని అమితాబ్ చెప్పడం విశేషం.  తేజి బచ్చన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.  భారత మహిళా ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుల్లో తేజీ బచ్చన్ కూడా ఒకరు.