మెగాస్టార్: ఒక హెచ్చ‌రిక‌.. ఒక ప్ర‌శంస‌!

మెగాస్టార్: ఒక హెచ్చ‌రిక‌.. ఒక ప్ర‌శంస‌!

ట్విట్ట‌ర్‌లో ఫాలోవ‌ర్స్ అస్థిర‌త‌పై అలిగిన మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అప్ప‌ట్లో నానా చీవాట్లు పెట్టారు. ట్విట్ట‌ర్ వ‌దిలి వెళ్లిపోతానంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో దిగొచ్చిన ట్విట్ట‌ర్ ప్ర‌తినిధులు ఏకంగా బిగ్‌బిని క‌లిసి వివ‌ర‌ణ ఇవ్వ‌డ‌మే గాకుండా త‌మ పొర‌పాట్ల‌ను అంగీక‌రించి, స‌మ‌స్య‌ను అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌టికి ఆ ఎపిసోడ్ ముగిశాక‌.. ట్విట్ట‌ర్ వాళ్ల సంజాయిషీకి సంతృప్తి చెందిన అమితాబ్ సంతోషించారు. 

ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ స్టార్ట్ చేశాక 2,793 ట్వీట్లు చేశారాయ‌న‌. 3000 ట్వీట్ల‌కు ఇంకెంతో దూరంలో లేనేలేరు. ఇలాంటి వేళ .. ట్విస్ట‌ర్ సేవల్ని ఆయ‌న కొనియాడారు. ఫాలోవ‌ర్స్‌ని స్థిరంగా ఉంచ‌డంలో ట్విట్ట‌ర్ మేనేజ్‌మెంట్ ప‌నిత‌నం బాగా న‌చ్చింది అంటూ క్లాప్స్(ఈమోజీలు పెట్లారు) కొట్టారు. వెల్ డ‌న్ .. మ్యాగ్జిమం నిలబెట్ట‌గ‌లిగారు`` అని పొగిడేశారు. ఎంత‌కీ క‌ద‌ల‌ని స్కోర్ బోర్డును.. ప‌రుగులెత్తించేలా.. ప్ర‌తి బంతిని సిక్స‌ర్ కొట్టేలా ఎలా మ్యానేజ్ చేయ‌గ‌ల‌రు? అని ఫ‌న్నీగా ప్ర‌శ్నించారు బిగ్‌బి. మెగాస్టార్.. ఒక హెచ్చ‌రిక‌.. ఒక ప్ర‌శంస బావున్నాయి క‌దూ?