'రోల్స్ రాయిస్' కారు అమ్మేసిన బిగ్ బీ

'రోల్స్ రాయిస్' కారు అమ్మేసిన బిగ్ బీ

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ తన ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారును అమ్మేశారు. దీనికి కారణాలు, ఎంత ధరకు అమ్మారన్న వివరాలు బయటికి పొక్కలేదు. 'ఏకలవ్య' సినిమా హిట్ సాధించినందుకు 2007లో ప్రముఖ నిర్మాత విధూ వినోద్ చోప్రా సిల్వర్ కలర్ 'రోల్స్ రాయిస్' కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పట్లో దీని ధర రూ. 3.5 కోట్లు. ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఫాంటమ్ ను మైసూరుకు చెందిన రుమాన్ ఖాన్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బిగ్‌బి గ్యారేజ్‌లో ఇప్పటికే చాలా ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.. అందులో ఫాంటమ్‌ కూడా ఒకటి. ప్రస్తుతం అమితాబ్ గ్యారేజ్‌లో మెర్సిడెజ్‌-మేబ్యాక్‌ 5500, బెంట్లీ కాంటినెంటల్‌ జీటీ, ల్యాండ్‌ రోవర్‌, టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్సీ 200, పోర్షే కేమ్యాన్‌, రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ, ఆడీ ఏ8ఎల్‌, టొయోటా క్యామ్రీ, మిని కూపర్‌ ఉన్నాయి. ఇటీవల లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ 570 ఎస్‌యూవీని కొనుగోలు చేశారు.