మరికాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా..

మరికాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా..

మరి కాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా రానున్నారు. ఉదయం 10 గంలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు రానున్న అయన ఎయిర్ పోర్ట్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అక్కడి నుంచి 10.45గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 11.30గంటలకు వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫలమండి హనుమాన్ మందిర్ వరకు రోడ్ షో(1.3కి మీ) చేయనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1.30గంటలకు నాంపల్లి పార్టీ కార్యాలయంలో లంచ్ చేయనున్నారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు అమిత్ షా. పార్టీ కార్యాలయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడనున్నారు.

అమిత్ షా సమక్షంలో పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత సనత్‌ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. రెండు గంటలకు బీజేపీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.  తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి ప్రచారం, పోలింగ్ రోజున కార్యాచరణపై సమీక్షిస్తారు. ఏడు గంటలకు విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. అమిత్‌షా రోడ్‌షో సందర్బంగా... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సాయంత్రం 5.30గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.