కమలంతోనే విశాఖ వాసులకు వికాసం

కమలంతోనే విశాఖ వాసులకు వికాసం

గత ఐదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, మరింత అభివృద్ధి పథానికి ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం రాత్రి కంచరపాలెం బీఆర్టీఎస్ కారిడార్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. కమలంతో విశాఖ వాసులకు వికాసం ఉంటుందని, దేశ ప్రజలను స్వచ్ఛత వైపు నడిపించేందుకు బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్ధి దగ్గుబాటి పురందేశ్వరిని లోక్ సభకు పంపే బాధ్యత విశాఖ ప్రజలదేనన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి కూడా విశాఖ నగరంలోని పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. ఊర్వశి కూడలి జాతీయ రహదారి నుంచి కంచరపాలెం నేతాజీ ఫ్లైఓవర్ కూడలి వరకు ఈ రోడ్ షో సాగింది.