'2024లో తెలంగాణలో మాదే అధికారం'

'2024లో తెలంగాణలో మాదే అధికారం'

2024 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అధినేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ హాల్‌లో ఇవాళ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన షా.. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమన్నారు. 

తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీయే గెలవాలన్నారు.  తమను చులకనగా చూసిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్న షా.. తెలంగాణలో 20 లక్షల సభ్యత్వమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ సహా, ఏపీ, కేరళలోనూ బలపడతామని ధీమా వ్యక్తం చేశారు షా.   బీజేపీలో ప్రతి సభ్యుడికీ ప్రాధాన్యం ఉంటుందన్న షా.. కింది స్థాయి నాయకుడు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం పార్టీ కల్పిస్తోందన్నారు.