గిరిజన మహిళ ఇంటికి షా.. 

గిరిజన మహిళ ఇంటికి షా.. 

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందకు కేంద్ర హోం మంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. పహాడీ షరిఫ్‌లోని రంగనాయకుల తండాలో నివసిస్తున్న సోనీబాయి అనే మహిళకు సభ్యత్వ పత్రాన్ని అందజేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షా.. స్వయంగా సోనీ బాయి నివాసానికి చేరుకోవడంతో ఆయన కోసం ఆమె జొన్నరొట్టె, పప్పు, ఉప్మా తదితర వంటకాలను తయారు చేశారు.  ఆమె ఇచ్చిన తినుబండాలను షా ఆప్యాయంగా తిన్నారు. అమిత్‌ షాతో కుటుంబసమేతంగా సోనీ ఫొటో కూడా దిగారు. తమ సమస్యలను వివరిస్తూ ఓ వినతపత్రాన్ని అందజేశారు సోనీ బాయి. సోనీ స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి. 35 ఏళ్ల క్రితం భర్తతో వచ్చిరంగనాయక తండాలో స్థిరపడింది.