ఆమ్రపాలికి ఢిల్లీ బదిలీ.. కొత్త జాబ్‌ ఇదే..

ఆమ్రపాలికి ఢిల్లీ బదిలీ.. కొత్త జాబ్‌ ఇదే..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులు ఆమ్రపాలి కాటా, కె.శశికిరణాచారిలకు ఢిల్లీ బదిలీ అయ్యింది. వీరిద్దరినీ  కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలందడంతో త్వరలోనే రిలీవ్‌ చేయబోతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో వీరిద్దరూ ఇకపై విధులు నిర్వహించబోతున్నారు.  ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్‌ పీఎస్‌గా కె.శశికిరణాచారి పనిచేయబోతున్నారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.