ప్రెగ్నెంట్ అయినా... రూట్ మార్చలేదు

ప్రెగ్నెంట్ అయినా... రూట్ మార్చలేదు

బ్రిటిష్ హీరోయిన్లు ఎక్కువగా హాలీవుడ్ లో కనిపిస్తుంటారు.  లేదు అంటే బాలీవుడ్ వరకు వస్తుంటారు.  కానీ, బ్రిటిష్ మోడల్, హీరోయిన్ మాత్రం ఏకంగా సౌత్ ఇండియాకు వచ్చేసింది.  సౌత్ లో అనేక సినిమాలు చేసింది.  రీసెంట్ గా రజినీకాంత్ తో 2పాయింట్ 0 సినిమా చేసింది.  ఈ సినిమా తరువాత ఈ అమ్మడు తిరిగి లండన్ వెళ్ళింది.  ఆమె ప్రేమించిన బ్రిటిష్ బిజినెస్ మెన్ జార్జిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.  

వివాహానికంటే ముందే ఈ అమ్మడు గర్భం ధరించింది.  గర్భం ధరించిన తరువాత హీరోయిన్లు దాదాపుగా మీడియాకు దూరంగా ఉంటారు.  ఎప్పుడైనా మీడియాకు కనిపించి మాయం అవుతుంటారు.  కానీ, అమీ రూటే వేరు అంటోంది.  ప్రెగ్నెంట్ అయిన తరువాత కూడా ఫోటో షూట్ లు చేస్తూ దూసుకుపోతోంది.  గెస్ అనే బ్రాండ్ కు ఈ అమ్మడు బ్రాండ్ అంబాసిడర్.  గర్భం ధరించినా మోడలింగ్ కు అవేమి షరతులు కావని చెప్తోంది అమీ.  రీసెంట్ గా గెస్ లాస్ ఏంజిల్స్ 1981 పేరుతో ఉత్పత్తులను ప్రారంభించారు.  ఈ సందర్భంగా అమీ ఫోటో షూట్ చేసింది.  వైట్ కలర్ డ్రెస్ లో అమీ మెరిసిపోయింది.  ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.