నేలచూపులు చూసిన స్టాక్ మార్కెట్ !

నేలచూపులు చూసిన స్టాక్ మార్కెట్ !


నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. ఈరోజు నష్టాలతోనే ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్ అమ్మకాల ఒత్తిడితో వరుసగా రెండో రోజు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. దీంతో 200 పాయింట్లు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ తర్వాత మరింత పతనమైంది. చివరకు 383 పాయింట్లు పతనమై 37,069 వద్ద ముగిసింది, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 10,948 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈ లో సన్‌ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్టీపీసీ వంటి సంస్థలు స్వల్పంగా లాభపడ్డాయి. మరోవైపు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ లు నష్టాలను చవి చూశాయి.