వైరల్: భర్తకు విడాకులిచ్చిన ఆ మహిళ కొడుకును పెళ్లాడింది... ఇప్పుడు ఆమె...
చాలా రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అయ్యింది. ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి కొడుకును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ న్యూస్ రష్యాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వైరల్ నుంచి సంబంధించిన మరొక అప్డేట్ బయటకు వచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చి, కొడుకును వివాహం చేసుకున్న ఆ మహిళ ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కొత్తగా జన్మించిన తన చిన్నారి బిడ్డతో దిగిన ఫోటోను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నది. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయి కి చెందిన 35 ఏళ్ల మరియా అనే మహిళ 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిని పదేళ్ల క్రిందట వివాహం చేసుకుంది. అప్పటికే ఆ వ్యక్తికి పదేళ్ల బాబు ఉన్నాడు. పదేళ్ల కాపురం తరువాత మరియా తన భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, కొడుకు వ్లాదిమిర్ స్టెప్ మదర్ మరియాను విడిచి ఉండలేకపోయాడు. స్టెప్ మదర్ మరియాను తరచుగా కలుస్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఉన్నది తల్లి కొడుకుల అనుబంధం కాదని, అంతకు మించి అని భావించిన మరియా తన మనసులోని మాటను వ్లాదిమిర్ కు తెలిపింది. మరియా చెప్పిన మాటలకు ఎగిరిగంతేసిన వ్లాదిమిర్ సరే అని చెప్పాడు. ఇద్దరు వివాహం చేసుకున్నాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక తండ్రి కూడా ఒకే చెప్పాడు. ఇద్దరు వివాహం చేసుకున్నారు. సవతి కొడుకును వివాహం చేసుకున్న మరియా కొన్నిరోజులకు గర్భవతి అయ్యింది. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)