సన్నీ, పాటిల్, రవి.. ఈ థమ్సప్ యాడ్ చూశారా?

సన్నీ, పాటిల్, రవి.. ఈ థమ్సప్ యాడ్ చూశారా?

టీమిండియా క్రికెటర్లను బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకోవడం సర్వసాధారణమై పోయింది. క్రికెట్ ను మతంగా భావించే దేశంలో క్రికెటర్ల మొహాలు, పేర్లు ఇంటింటా మార్మోగుతున్నాయి. కానీ 1990లకి ముందు క్రికెటర్లు వ్యాపార ప్రకటనల్లో కనిపించడం చాలా అరుదు. కానీ 1980ల ప్రారంభంలో రూపొందించిన థమ్సప్ యాడ్ చూస్తే మీకు కన్నుల పండగే. ఇందులో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చిన రవిశాస్త్రి కనిపిస్తారు. ఈ వీడియోలో ముగ్గురు స్టార్ క్రికెటర్లు క్రికెట్ బంతి, థమ్సప్ బాటిల్, ఓపెనర్ తో జగ్లింగ్ చేస్తుంటారు. అలా కాసేపు ఒకరికొకరు విసురుకున్నాక బాటిల్, ఓపెనర్ రెండూ గవాస్కర్ కి వస్తాయి. సన్నీ థమ్సప్ సీసా తెరవడంతో యాడ్ ముగుస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ యాడ్ ని మీరూ ఓ సారి చూడండి.