అందుకే వైసీపీలో చేరుతున్నా..: ఆనం

అందుకే వైసీపీలో చేరుతున్నా..: ఆనం

సెప్టెంబర్‌ 2న వైసీపీలో చేరబోతున్నానని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించాలంటే పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించారని ఆయన చెప్పారు. ఇవాళ నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగిస్తానని జగన్‌ భరోసా ఇచ్చారని చెప్పారు. వైసీపీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నవాళ్లందరూ ఒకప్పుడు తన సహచరులేని అన్నారు.  అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తామని ఆనం చెప్పారు. జగన్‌ ఎక్కిడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానన్న ఆనం.. తనకు టికెట్‌ మీద, అధికారం మీద ఆశలేదని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆశించినమేర అభివృద్ధి పనులు చేయలేకపోయానని ఆనం అన్నారు.