లాక్‌డౌన్‌పై పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఏమన్నారంటే!

లాక్‌డౌన్‌పై పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఏమన్నారంటే!

లాక్‌డౌన్‌ను పొడిగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఆత్మహత్యా సదృశ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అభిప్రాయపడ్డారు. లక్షల మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ.. దాన్ని ఇంకా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని హెచ్చరించారు. కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ కర్వ్‌ సమాంతరంగా ఉన్నప్పటికీ మళ్లీ కొత్త కేసులు పెరిగాయని.. ఎక్కువ పరీక్షలు చేయడంతో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయన్నారు. దేశ జనాభా, ప్రపంచంతో పోల్చుకుంటే అది తక్కువేనన్నారు. అయితే, మరణాల రేటు.. ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువగా ఉందన్నారు.  దేశంలో కరోనా మరణాలను తగ్గించేందుకు ఆక్సీజన్‌ వసతులతో కూడిన తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మహీంద్ర సూచించారు. విస్తృతంగా పరీక్షలు చేయాలని, వైరస్‌ కాంటాక్ట్‌లను వెతికి పట్టుకోవాలని తెలిపారు. మనం వైరస్‌తో కలిసి జీవించాల్సిందేనని... ఆ వైరస్‌ గడువు ముగిసే పర్యాటక వీసాపై ఇక్కడికి రాలేదని ఆనంద్‌ మహీంద్ర స్పష్టం చేశారు.