అమెరికా అధ్యక్షఎన్నికలపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్...ట్రంప్ గెలిస్తే...  

అమెరికా అధ్యక్షఎన్నికలపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్...ట్రంప్ గెలిస్తే...  

ప్రపంచ చరిత్రలో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.  ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొన్నది.  ట్రంప్, జో బిడెన్ ఇద్దరు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉన్నారు.  ఎవరు గెలుస్తారు అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.  అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది.  కరోనా సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడం, జార్జ్ ఫ్లాయిడ్ ఘర్షణల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.  ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు ఆ దేశంపై ప్రభావం చూపుతున్నాయి.  అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.  ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఓ వ్యక్తి పాపులర్ అవుతారని అన్నారు.  ట్రంప్ గెలుస్తాడని ఆ జ్యోతిష్యుడు ముందుగానే చెప్పాడని, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా,చివరికి గెలిచేది ట్రంపే అని జోతిష్యుడు చెప్పినట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్నారు.  అయితే, ట్రంప్ కు జో బిడెన్ నుంచి గట్టి పోటీ ఉంటుందని కూడా జోతిష్యుడు చెప్పినట్టు మహీంద్రా ట్వీట్ చేశారు.  జ్యోతిష్యుడు పేరును చెప్పలేదు.  జోతిష్యుడు గీసిన ట్రంప్ జోతిష్యాన్ని  మహీంద్రా ట్వీట్ చేశారు.  ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  మరి ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా ట్రంప్ గెలుస్తాడా చూడాలి.