ప్రపంచంలో అత్యద్భుతమైన ఫోటో ఇదే..!!

ప్రపంచంలో అత్యద్భుతమైన ఫోటో ఇదే..!!

ప్రపంచంలో ఇప్పుడు ఉన్న విగ్రహాలన్నీ మనిషి నిర్మించినవే. మనిషి మేధస్సు నుంచి రూపుదిద్దుకున్న విగ్రహాలు అవి.  ప్రపంచంలో అత్యద్భుతమైన విగ్రహం ఏంటి అంటే అందరు తమకు నచ్చిన విగ్రహం గురించి చెప్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది.  అభిరుచి ఉంటుంది.  ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా వ్యాపారంలో ఎంత విభిన్నంగా ఆలోచిస్తాడో.. ఇలాంటి విషయాల్లో కూడా అనే విభిన్నంగా ఆలోచిస్తాడు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించినపుడే అభివృద్ధి, గుర్తింపు ఉంటుంది.  

ఇక మహీంద్రా తనకు అత్యంత ఇష్టమైన విగ్రహం గురించి చెప్తూ ఓ ఫోటోను షేర్ చేశారు.  నలుగురు పిల్లలు చేరి దుర్గామాత అవతారంలో కూర్చున్నప్పటి ఫొటో అది. దాన్ని ట్వీట్‌ చేస్తూ..‘ ఇంతకంటే అత్యుత్తమైన మందిరాన్ని, విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు. మానవ సంకల్పం విషయంలో పిల్లలెప్పుడూ ముందే ఉంటారు’ అని ట్వీట్ చేశారు.  ఈ వీటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అందరికంటే భిన్నంగా ఆలోచించడంలో ఆనంద్ మహీంద్రా ముందు ఉంటారు అని మరోసారి నిరూపించారు.