వైరల్:  ఆ యాడ్ చూసి ఆనంద్ మహీంద్రా ఏడ్చేశాడు...!!

వైరల్:  ఆ యాడ్ చూసి ఆనంద్ మహీంద్రా ఏడ్చేశాడు...!!

కొన్ని యాడ్స్ హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి.  అలాంటి యాడ్స్ లో ఒకటి ఇది.  ఓ పెద్దాయన ప్రతి రోజు బరువులు ఎత్తడం చేస్తుంటాడు.  ఎందుకు అలా చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కాదు.  ప్రతి ఒక్కరు కూడా ఆ పెద్దాయన వంక అదోలా చూస్తుంటారు.  చాదస్తమా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకొంటారు.  ఈ వయసులో బరువులు ఎత్తడం ఏంటి విచిత్రం కాకపోతేనూ అని చెవులు కోరుకుంటారు.  కానీ, ఆ పెద్దాయన మాత్రం అవేమి పట్టించుకోకుండా అలానే బరువులు ఎత్తుతూ ఉంటాడు.  యాడ్ చివరి వరకు అలానే చేస్తాడు.  యాడ్ చివర్లో అతని మనవరాలు క్రిస్మస్ కి ఇంటికి వస్తుంది.  క్రిస్మస్ ట్రీపై స్టార్ ను పెట్టేందుకు మనవరాలిని ఆ పెద్దాయన ఎత్తుకుంటాడు.  తానే స్వయంగా మనవరాలిని ఎత్తుకోవాలని, చెట్టుపై స్టార్ ను పెట్టించాలని అనుకుంటాడు.  శరీరం సహకరించాలి అంటే ముందు నుంచే బరువులు ఎత్తడం ప్రాక్టీస్ చేయాలి కదా అనుకోని అలా ప్రాక్టీస్ చేస్తాడు.  ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా కంటతడి పెట్టాడట.  భావోద్వేగంతో నిండిన యాడ్ అని, కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ట్వీట్ చేశాడు.  దీంతో ఈ యాడ్ ఇప్పుడు వైరల్ గా మారింది.