మహీంద్ర మరో ట్వీట్.. చివరి వరకూ పోరాడు..!

మహీంద్ర మరో ట్వీట్.. చివరి వరకూ పోరాడు..!

ఆనంద్‌ మహీంద్ర... ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఇది. మహీంద్ర గ్రూప్ చైర్మన్. దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్నా... తన సత్తాతో, తెలివితేటలతో నష్టాల్లో ఉన్న కంపెనీనైనా లాభాల బాట పట్టించగల మొనగాడు. ఇక, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రకు.. లక్షల్లో అభిమానుల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన రీట్వీట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని మహీంద్ర ట్వీట్ చేశారు. 

ఆయన ట్వీట్ చేసిన వీడియో ఓ కబడ్డీ మ్యాచ్ కు చెందినది. కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్ ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర, ప్రొకబడ్డీ లీగ్ లో కూడా ఇలాంటి సీన్ చూడలేదని కామెంట్ చేశారు. ఏదైనా చివరి వరకు పోరాడు అనే సందేశాన్ని ఇచ్చాడు మహీంద్ర.