ఇడ్లీ ఎఫెక్ట్ : బామ్మకు ఆనంద్ మహేంద్ర సపోర్ట్..!!

ఇడ్లీ ఎఫెక్ట్ : బామ్మకు ఆనంద్ మహేంద్ర సపోర్ట్..!!

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం.. ఆ గ్రామంపేరు వడివేలపాళ్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్ల బామ్మ.. ఆమెపేరు కమలతాల్.. 80 ఏళ్ల వయసులోని మహిళలు మునిమనమలతో ఆడుకుంటూ ఉంటారు.. లేదంటే భక్తిమార్గంలో ఉంటారు.  కానీ, కమలతాల్ అలా కాదు. ఆ గ్రామంలో పేదల ఆకలి తీర్చేందుకు ఇడ్లి వ్యాపారం చేస్తున్నది.  గత ముప్పై ఏళ్లుగా అదే వ్యాపారం.  ఒక్కో ఇడ్లి కేవలం ఒక్క రూపాయి మాత్రమే.  అంతకంటే ఎక్కువ ధరకు అమ్మడానికి ఆమె మనసు ఒప్పుకోదు.  

ఇడ్లి బామ్మ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాక.. క్షణాల్లో ఫెమస్ అయ్యింది.  ఆ గ్రామానికి మీడియా తాకిడి ఎక్కువైంది.  ఆమెను పెద్దపెద్ద చానళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నాయి.  సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో కమలతాల్ గురించి ఆనంద్ మహేంద్రకు తెలిసింది.  వెంటనే అయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.  కమలతాల్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.  బామ్మ ఇప్పటికి కట్టెలపొయ్యిలోనే ఇడ్లిలు చేస్తోందని, ఆ బామ్మకు గ్యాస్ స్టవ్ కొనిస్తానని చెప్పారు.  ఇదే విషయంపై ఇండియన్ ఆయిల్ సంస్థ కూడా స్పందించింది.  ఇండియన్ ఆయిల్ నుంచి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది.  అయితే, కోయంబత్తూరు కు చెందిన భారత్ సంస్థ కమలతాల్ కు గ్యాస్ స్టవ్ సిలిండర్ ను గిఫ్ట్ గా అందించింది.  బామ్మ చేస్తున్న సేవలను మెచ్చుకొని ఆమె ఆరోగ్యం కోసం గిఫ్ట్ గా ఇచ్చినట్టు పేర్కొన్నారు.  భారత్ గ్యాస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆనంద్ మహేంద్ర మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.