ఆ పిల్లాడిని చూసి ఆనంద్ మహీంద్రా కన్నీరు పెట్టుకున్నాడు.. ఎందుకంటే..!!

ఆ పిల్లాడిని చూసి ఆనంద్ మహీంద్రా కన్నీరు పెట్టుకున్నాడు.. ఎందుకంటే..!!

శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉంటేనే జీవితంలో నెగ్గుకురావడం కష్టంగా మారింది.  హెవీ కాంపిటీషన్లో ఒకరో ఇద్దరో గెలుస్తుంటారు.  పోటిని తట్టుకొని నిలబడాలి అంటే బలపడాలి.  సవ్యసాచిలా బలం ఉండాలి.  సవ్యసాచి అంటే బలమైన బాహువులు కలిగిన వ్యక్తి అని అర్ధం ఉంది.  రెండు చేతులు సరిగా ఉండి బలంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం.  రెండింటిలో ఒక్కటి సరిగా లేకున్నా జీవనం కుంటుపడుతుంది.  

అదే రెండు చేతులు లేకుంటే.. ఇక వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.  రెండు చేతులు, కాళ్ళు సరిగా లేకుండా జన్మించి .. జీవితంలో ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో జీవితంపై విజయం సాధించిన వ్యక్తి, వక్త నిక్ ఉజిసిక్. అయన గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది.  మానసిక వేత్తగా ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు.  ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వందలాది ప్రసంగాలు చేశాడు.  నిక్ ను పోలిన మరో వ్యక్తి జన్మించాడు.  ఆ పిల్లవాడికి రెండు చేతులు లేవు.. ఆ చిన్న పిల్లవాడు తన కాళ్ళనే చేతులుగా మలుచుకొని స్పూన్ తో ఆహారం తీసుకుంటున్నాడు.  దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  "వాట్సాప్‌లో దీన్ని చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయానన్నారు. జీవితంలోని లోపాలను, ఎదురయ్యే సవాళ్లను బహుమతిగా భావించాలని.. అది మన చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఇలాంటి వీడియోలు, చిత్రాలు తన ఆశావాదాన్ని కోల్పోకుండా చేస్తాయని" మహీంద్రా ట్విట్టర్ లో పేర్కొన్నాడు.  ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.