వైరల్: ఆనంద్ మహీంద్రా ట్వీట్... భౌతిక దూరానికి షార్ట్ కట్... 

వైరల్: ఆనంద్ మహీంద్రా ట్వీట్... భౌతిక దూరానికి షార్ట్ కట్... 

కరోనా కాలంలో మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం వంటి పదాలు బాగా అలవాటు అయ్యాయి.  కరోనా కేసులు తగ్గిపోయాయిలే అని చెప్పి వీటిని పట్టించుకోవడం మానేసిన తరువాత సెకండ్ వేవ్ మరింత ఉదృతం అయ్యింది.  సెకండ్ వేవ్ ఉదృతం కావడంతో తిరిగి మాస్క్, భౌతిక దూరం వంటివి పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న ఉద్యోగితో తలను గాజు గ్లాస్ లోపలికి దూర్చి మాట్లాడుతున్నాడు.  దీనికి సంబంధించిన ఫోటోను బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసి మనకు ఇంకా భౌతిక దూరం అలవాటు కాలేదని, భౌతిక దూరానికి షార్ట్ కట్ ఇదే అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.