41 ఏళ్లకే ఆ పారిశ్రామిక‌వేత్తకు గుండెపోటు

41 ఏళ్లకే ఆ పారిశ్రామిక‌వేత్తకు గుండెపోటు

41 ఏళ్లకే యువ పారిశ్రామికవేత్త అనంత్ బజాజ్ గుండెపోటుతో మృతిచెందాడు. అనంత్... బజాజ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కుమారుడు. శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ముంబైలో గుండెపోటుతో కన్నుమూశాడు అనంత్ బజాజ్‌. ఈ రోజు ఉదయం 10.30 గంటల తర్వాత చందన్వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మార్చి 2012లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఉమ్మడి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితుడైన అనంత్... రెండు నెలల క్రితం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఒక ప్రాజెక్ట్ సమన్వయకర్తగా తన వృత్తిని ప్రారంభించి... అంచలంచెలుగా ఎదిగాడు అనంత్ బజాజ్. ఆయన మృతిపట్ల పలువురుపారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.