అనంతలో కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ ఆగ్రహం

అనంతలో కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ ఆగ్రహం

అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపించారు. స్థలం లేదంటూ టేబుళ్ల సంఖ్య ఎలా తగ్గిస్తారంటూ మండిపడ్డారు. ఉరవకొండ కౌంటింగ్ పాయింట్ లో టేబుళ్ల సంఖ్యను 14 నుంచి 12కు కుదించారని ఆరోపిస్తున్నారు. 25 మంది నిలబడే స్థలంలో 250 మంది నిలబడే పరిస్థితి ఉందని అంటున్నారు. ఏర్పాట్లు ఇలాగే ఉంటే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం ఖాయమని జిల్లా టీడీపీ నాయకులు అంటున్నారు. కౌంటింగ్ కేంద్రంలో గొడవలు జరిగితే దానికి ఈసీనే బాధ్యత వహించాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సరిగా లేవని ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతామని టీడీపీ నాయకులు తెలిపారు.