"అనన్య -అసామాన్య "... నాన్ స్టాప్ గా 23గంటలు షూట్ 

"అనన్య -అసామాన్య "... నాన్ స్టాప్ గా 23గంటలు షూట్ 

బాలీవుడ్ బ్యూటీ 'అనన్య పాండే' ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరంలేదు. గత ఏడాది 'స్టూడెంట్ ఆఫ్ డి ఇయర్ 2' తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కుర్రది. అనన్యుపాండే ప్రముఖ నటుడు చుంకీ పాండే తనయ. ఈ భామ అందంగా ఉంటుంది, చక్కగా నటిస్తుంది వీటితో పాటు కష్టపడే మనస్తత్వం కూడా ఎక్కువే ఈ అమ్మడికి. ఇటీవల ఈ వయ్యారి నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొన్నదంట.

ప్రస్తుతం అనన్య 'ఖాలీ పీలీ' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకోసం ఏకంగా 23 గంటలు రెస్ట్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిందంట. దాంతో చిత్రయూనిట్ అంత అమ్మడి కష్టాన్ని చూసి 'అనన్య - అసామాన్య' అంటూ  అభినందించారట.  పని విషయంలో అనన్య చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే తప్పకుండా మంచి పేరు తెచుకుంటుందని అంతా అంటున్నారు.