మహేష్ సినిమాలో మరో హీరోయిన్ గా అనన్య పాండే...

మహేష్ సినిమాలో మరో హీరోయిన్ గా అనన్య పాండే...

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కీర్తి సురేష్ ని తీసుకోగా మరొకరి స్థానంలో అనన్య పాండే ను తీసుకోవాలని చూస్తున్నారట! అయితే ఈ సినిమా స్రిప్ట్ ను పరశురామ్ అనన్య కు చెప్పినట్లు సమాచారం. ఇక కథ నచ్చడంతో అనన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అనన్య విజయ్ దేవరకొండతో "ఫైటర్" అనే సినిమాలో నటిస్తుంది.