వైఎస్సార్ బయోపిక్ లో అనసూయ

వైఎస్సార్ బయోపిక్ లో అనసూయ

దిగవంత నేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర పేరుతో ఓ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపించనుండగా, మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితమే హైదరాబద్ లో ఈ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 

తాజాగా ఈ చిత్రంపై అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ యాంకర్ అనసూయ ఓ పాత్రలో మెరవనున్నారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలి పాత్రలో నటించనుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనసూయా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన ప్రతిభ చూపిస్తూ క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేస్తోంది. ఈ బయోపిక్ లో సుహాసిని హోమ్ మంత్రి పాత్రలో సబితా ఇంద్రారెడ్డిగా కనిపించనుండగా, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించనున్నాడు. ఈ చిత్రంలో 2004 ఎన్నికలక ముందు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర మొదలుకుని రాజకీయ ప్రస్థానంలోని ప్రముఖ ఘట్టాలను ఆవిష్కరించనున్నారు.