యాంకర్ అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్ వివాదం

యాంకర్ అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్ వివాదం

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులరైన యాంకర్ అనసూయ భరద్వాజ్.  యాంకర్ గా సక్సెస్ అయ్యాక సినీ రంగంపై దృష్టి సారించింది.  చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన అనసూయకు.. థ్రిల్లర్ సినిమా క్షణంతో మంచి బ్రేక్ వచ్చింది.  అప్పుడప్పుడు ప్రత్యేక నృత్యాల్లో నటిస్తున్న ఈ యాంకరమ్మకు రంగస్థలంలో అనసూయమ్మత్త పాత్ర పెద్ద బ్రేక్ అని చెప్పాలి.  ఈ పాత్రలో అనసూయ అద్భుతంగా నటించింది.  

ఇదంతా గ్లామర్ ప్రపంచం.  గ్లామర్ రంగంలో మంచి పేరు సంపాదించుకున్న నటీనటులను ప్రత్యేక కార్యక్రమాలకు ప్రత్యేక అతిధులుగా పిలుస్తుంటారు.  ఇలాంటి అవకాశమే అనసూయకు వచ్చింది.  భువనగిరి బైపాస్ మార్గంలో ఉన్న వివేరా హోటల్ లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి పిలుపు వచ్చింది.  జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది.  వివేరా నుంచి పిలుపు రాగానే వెంటనే ఓకే చెప్పిన అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్ కు వెళ్లి జెండా ఎగరవేసింది.  ఆ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  రెడ్ కలర్ టీ షర్ట్, గళ్ళు గళ్ళు ఉన్న లాంగ్ స్కర్ట్ వేసుకొని ఫ్లాగ్ హోస్ట్ చేయడంతో వివాదంగా మారింది.  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి మోడ్రన్ డ్రెస్ తో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఏంటని కొంతమంది ట్విట్టర్లో విమర్శించడం మొదలు పెట్టారు.  మరికొందరు మాత్రం అందులో తప్పేముంది.. అని అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు.  మొత్తానికి అనసూయ ఎగరవేసిన ఫ్లాగ్ హోస్టింగ్ ఇలా వివాదానికి దారితీసిందన్నమాట.