అనసూయ దగ్గర అంత డబ్బుందా ?

అనసూయ దగ్గర అంత డబ్బుందా ?

వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ.  ఒకానొక దశలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యాఖ్యాత స్థాయికి ఎదిగారామె.  ఆ తర్వాత సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయ్యారు.  ఆమె చేతిలో ఇప్పుడు సినిమా ఆఫర్లు చాలానే ఉన్నాయి.  అంతేకాదు త్వరలో స్వయంగా సినిమాల్ని నిర్మించనున్నట్లు తెలిపారట.  ఈ సంగతి తెలిసిన ప్రేక్షకులు ఒక యాంకర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వద్ద నిర్మాతగా మారి కోట్ల వ్యయంతో సినిమాలు నిర్మించేంత డబ్బు ఉందా.. అంటే యాంకర్ల రెమ్యునరేష్ భారీ స్థాయిలోనే ఉంటుందన్నమాట అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.