ఈ ఫొటోలోని హీరోయిన్ ను గుర్తుపట్టారా..?
ఒక్క అవకాశం ఇవ్వండి చాలు నేనేంటో నిరూపించుకుంటా అని సినిమా ఆఫీస్ ల చుట్టూ ఎందరో తిరుగుతుంటారు. అవకాశాలు వస్తాయా.. అంటే ఏమో ఎప్పటికి వస్తాయో చెప్పలేం. సినిమాల్లో నటించాలనే తపన ఉంటె.. దానికి తగిన మార్గాలను వెతుక్కోవాలి. సినిమాల్లో మాత్రమే నటిస్తానని చెప్పకుండా.. బుల్లితెరపై అవకాశాలను పట్టుకొని రాణిస్తే చాలు. వెండితెరపై ఆటోమాటిక్ గా అవకాశం వస్తుంది. వెండితెరకు బుల్లితెర ఒక మార్గం. ఎందరో అలా అవకాశాలను సంపాదించుకున్నారు. అందులో ఒకరు ఈమె.
నవ్వుల షోలో హాట్ హాట్ గా మెరుపులు మెరిపిస్తూ దూసుకుపోతున్న యాంకరమ్మ.. వెండితెరపై రంగమ్మత్తగా బోలెడు పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిన అనసూయ.. ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా వరసగా సినిమాలు చేస్తూ బిజీఅయింది. కథనం అనే ఓ పవర్ఫుల్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న అనసూయ వైఎస్సాఆర్ బయోపిక్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ ఓ కీలకపాత్ర చేస్తున్నదట.
ఆమె చేస్తున్న పాత్ర ఏమిటి అనే విషయాన్నిమాత్రం బయటపెట్టడం లేదు అనసూయ. యాత్ర సినిమా సెట్స్ లో ఉండగా దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారేంత కంటెంట్ అందులో ఏమున్నదనే అనుమానం రావొచ్చు. ఎంతైనా రంగమ్మత్త కదా. కంటెంట్ లేకున్నా వైరల్ అవుతుంది మరి. కావాలంటే చూడండి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)