యాంకర్ హేమంత్ కారుకు ప్రమాదం

యాంకర్ హేమంత్ కారుకు ప్రమాదం

ప్రముఖ రేడియో జాకీ, యాంకర్ హేమంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడ్డాడు. విజయవాడలో శనివారం రాత్రి నిర్వహించిన మహేశ్‌బాబు ‘మహర్షి’ విజయోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. అనంతరం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే హేమంత్‌ వాహనం గేదెను ఢీకొని పల్టీలు కొట్టింది. ఆ సమయంలో హేమంత్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.