ఆండర్సన్‌కు జరిమానా

ఆండర్సన్‌కు జరిమానా

ఇంగ్లాండ్‌ ఫాస్ట్ బౌలర్ జేమ్స్‌ అండర్సన్‌కు జరిమానా విధించారు. ఓవెల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదవ టెస్టులో రెండో రోజు ఐసీసీ క్రీడా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ అండర్సన్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. అంతేకాదు అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ను కూడా జతచేశారు.

భారత మొదటి ఇన్నింగ్స్ 29వ ఓవర్లో అండర్సన్‌ వేసిన బంతి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్యాడ్లను తాకింది. జిమ్మీ వెంటనే అప్పీల్‌ చేసినా.. ఫీల్డ్ అంపైర్‌ ధర్మసేన తిరస్కరించాడు. దీంతో జిమ్మి రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు తాకే అవకాశం ఉన్న కారణంతో థర్డ్‌ అంపైర్‌ తుది నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలేశాడు. ధర్మసేన నాట్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఆవేశానికి లోనై ధర్మసేనతో పాటు కోహ్లిని కూడా ఏదో అన్నాడు. ఈ విషయమై ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్‌, ఫోర్త్ అంపైర్‌ రిఫరీకి ఫిర్యాదు చేశారు. విచారణలో జిమ్మీ తన తప్పును అంగీకరించాడు. దీంతో లెవల్‌-1 కింద జిమ్మీకి జరిమానా విధించారు.