పీఎన్‌బీ చేతికి ఆంధ్రాబ్యాంక్‌?

పీఎన్‌బీ చేతికి ఆంధ్రాబ్యాంక్‌?

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) త్వరలోనే మూడు చిన్న బ్యాంకులను టేకోవర్‌ చేయనుంది. పీఎన్‌బీ టేకోవర్‌కు సంబంధించి రాయిటర్‌ వార్త సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఓరియంటల్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంకులను పీఎన్‌బీ టేకోవర్‌ చేయొచ్చని రాయిటర్స్‌ తెలిపింది. దీనికి సంబంధించి మూడు నెలల్లోగా పీఎన్‌బీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెండు లేదా మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను టేకోవర్‌ చేయాలని పీఎన్‌బీ భావిస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఈలోగా ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లన్నీ భారీగా క్షీణించాయి.